అగ్నిపర్వతం పేలుడు ధాటికి సునామీ.. మరో హెచ్చరిక
- December 25, 2018
అగ్నిపర్వతం పేలుడు దాటికి విరుచుకుపడ్డ సునామీ ఇండోనేసియాకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రాకాసీ అలల ధాటికి వందలాది ఇళ్లు కుప్పకూలాయి . వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చనిపోయిన వారి సంఖ్య 373కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది స్థానికులే ఉన్నట్లు తెలుస్తోంది. సుమత్రా , జావా దీవుల్లో ఇప్పటికీ 128 మంది జాడ తెలియరాలేదు.
సునామీ ప్రభావిత ప్రాంతాలు భీతావహంగా మారాయి. కుప్పకూలిన భవంతులు, విరిగిపడిన భారీ వృక్షాలు, నేలకూలిన కరెంట్ స్తంభాలతో ఎటు చూసినా దర్శన మిస్తున్నాయి. కన్నీటి సంద్రమైన దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవులు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . శిథిలాలను తొలగిస్తూ, వాటికింద చిక్కుకున్నవారిని కాపాడే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సునామీకి కారణమైన అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది. దీంతో మరో సునామీ విరుచుకుపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







