ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి
- December 25, 2018
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రీస్తు ప్రభోదించిన బైబిల్‌ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్ ఫాదర్‌లు సూచించారు. ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. శాంతియుత మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రీస్తు జననాన్ని, త్యాగాన్ని గుర్తు చేశారు. ఇక.. దేశ వ్యాప్తంగా అన్ని చర్చిలు విద్యుత్ కాంతులు, క్రిస్మస్ ట్రీలతో ధగధగలాడుతున్నాయి.
ఇక.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి జన సంద్రమైంది. కరుణామయుడి కటాక్షం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఆధ్వర్యంలో దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థన అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







