భారతీయ రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

- December 25, 2018 , by Maagulf
భారతీయ రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పిఎఫ్‌)/రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌(ఆర్‌పిఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌(యాన్సిలరీ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఖాళీలసంఖ్య: 789 ఇందులో ఆర్‌పిఎఫ్‌-539,ఆర్‌పిఎస్‌ఎఫ్‌ -259

విభాగాలవారీగా ఖాళీలు: కానిస్టేబుల్‌ , వాటర్‌ క్యారియర్‌-452, సఫాయివాలా-199, వ్యాషర్‌మ్యాన్‌-49, మాలి-7, గ్రేడ్‌ -3, టైలర్‌ -20, కాబ్టర్‌ -22.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌/పదోతరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి: 2019 జనవరి 1 నాటికి 18నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు-165సెం.మీ, మహిళలు-157సెం.మీ. ఎస్సి/ఎస్టి అభ్యర్థులు పుపురుషులు 160సెం.మీ, మహిళలు-152సెం.మీ ఉండాలి. చాతీ : గాలిపీల్చినప్సుడు పురుషులకు 80 సెం.మీల నుండి 85 సెం.మీ వరకువ్యాకోచం చెందాలి. ఎస్టి, ఎస్సి అభ్యర్థులకు 76.2సెం.మీ నుంచి 81.2 సెం.మీ వరకు వ్యాకోచం చెందితే సరిపోతుంది.

పెస్కేల్‌: ఆర్‌పిఎఫ్‌ పోస్టులకు రూ.19,900-63,200వరకు, ఆర్‌పిఎస్‌ఎఫ్‌ పోస్టులకు రూ. 21,700-69100.

ఫీజువివరాలు: రూ. 500/- ఎస్సి/ఎస్టి, ఎక్స్‌్‌సర్వీస్‌మెన్‌, మహిళ, మైనారిటీస్‌, ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ. 250/- పరీక్ష ఫీజును కూడా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ రాసిన జనరల్‌/ఒబిసి అభ్యర్థులకు రూ.400/- మిగితా అభ్యర్థులకు రూ. 250/- రిఫండ్‌ చేస్తారు.

ఎంపికవిధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, పిఇటి, పిఎంటి. ఈ మూడు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంటేషన్‌ వెరిఫికేషన్‌ చేసి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
రాతపరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(సిబిటి) 2019 ఫిబ్రవరి /మార్చిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 60 ప్రశ్నలు ఇస్తారు. దీనిగాను 45 నిమిషాలు కేటాయిస్తారు. దీనిలో జనరల్‌ అవేర్‌నెస్‌-20మార్కులు, అర్థమెటిక్‌ -20మార్కులు, జనరల్‌ ఇంటలీజెన్స్‌అండ్‌ రీజనింగ్‌ -20 మార్కులు అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. సిబిటిలో మెరిట్‌ సాధించిన వారికి పిఇటి, పిఎంటిలను నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌/హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో(తెలుగు సిబిటి పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ప్రారంభతేదీ: 2019జనవరి1.

దరఖాస్తు చివరితేదీ: 2019 జనవిర30

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com