శ్రీదేవి కోసమే ఆ సినిమా చూసాం అంటున్న అభిమానులు
- December 25, 2018
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జీరో. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికల పాత్రలు పోషించారు. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ అందుకుని, దేశవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవిని చివరిసారిగా చూసిన అభిమానులు ఆవేదన చెందారు.
ఈ సినిమాలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించింది. ఆమె మరణం తర్వాత తొలిసారి తెరపై కనపడటం, ఇదే చివరిసారి కావడంతో అభిమానులు బాధపడ్డారు. శ్రీదేవిని చూడటానికే సినిమాకు వెళ్లినట్లు కొందరు తెలిపారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. 'జీరో'లో శ్రీదేవి ఫొటోలను షేర్ చేశారు. ఇవి కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'శ్రీదేవి ఎంత అందంగా ఉన్నారో, శ్రీదేవిని చివరిసారిగా పెద్ద స్క్రీన్‌పై చూడటానికి సినిమాకు వెళ్లా, ఆమెను చివరిసారి చూసినప్పుడు మొత్తం థియేటర్ మౌనంగా ఉండిపోయింది, 'జీరో'లో శ్రీదేవి నా అంచనాలకు మించి ఓ దేవతలా కనిపించారు, ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయా, శాశ్వతమైన తార శ్రీదేవి కోసం 'జీరో' చూశా, మళ్లీ స్క్రీన్‌పై శ్రీదేవిని చూడటం బాగుంది, ఆమె సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.. కానీ ఇప్పుడు మనతో లేరు..' అంటూ ట్వీట్లు చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







