సెలెబ్రిటీ ని బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

- December 25, 2018 , by Maagulf
సెలెబ్రిటీ ని బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

దుబాయ్: ప్రమాదం ఎప్పుడు ఎలా చుట్టుముడుతుందో తెలీని రోజులివి..ఉదాహరణ ఈ సంఘటన. దుబాయ్ లో నివసిస్తున్న అరబ్ మహిళ ఒకానొక ప్రముఖ వ్యక్తి తో పరిచయం పెంచుకొని భారీగా మోసం చేయబోయి పోలీసులకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ వ్యక్తి తో ఒక అరబ్ మహిళకు ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఇరువురు తమ ఫోన్ నుంబర్లను కూడా షేర్ చేసుకున్నారు. అటుపై వాట్సాప్ లో వీరి పరిచయం ముదిరి ఏకంగా తన అస్లీల వీడియోను మహిళకు పంపించాడు ఆ ప్రముఖ వ్యక్తి. ఇదే ఆసరాగా చేసుకొని ఆ వీడియోను 'యూట్యూబ్' లో పెట్టేసి ఆ వ్యక్తి వద్దనుండి భారీ నగదు బ్లాక్ మెయిల్ చేసింది. తన అస్లీల వీడియోను 'యూట్యూబ్' లో చుసిన వ్యక్తి ఉలిక్కిపడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 'సైబర్ క్రైమ్' వెంటనే స్పందించి ఆ వీడియోను తొలగించి ఆపై మహిళపై కేసు నమోదు చేశారు. 

అపరిచిత వ్యక్తులకు తమ వ్యక్తిగత వివరాలు (వయసు, ఆర్ధిక) తెలపవద్దని; అలాగే తెలీని నంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్ ను కూడా జాగ్రత్తగా వ్యవహరించండి అని అధికారులు తెలిపారు. ఏదైనా అవాంఛిత సంఘటనలు జరిగితే వెనువెంటనే 8004888 నంబరుకు ఫిర్యాదు చేయచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com