నాన్న ఇచ్చిన మాటను కేటీఆర్ పట్టించుకోరా?

- December 25, 2018 , by Maagulf
నాన్న ఇచ్చిన మాటను కేటీఆర్ పట్టించుకోరా?

ఒకవైపు జాతీయ రాజకీయాల్ని చక్కబెడుతూనే.. క్యాబినెట్ కూర్పు మీద కూడా స్పెషల్ గా కన్నేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. నెలాఖరులోగా కొత్త క్యాబినెట్ కొలువు తీరవచ్చన్న అంచనాల నడుమ.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లో బిజీగా మారారు. ఇదిలా ఉంటే.. ఫలితాల మరుసటి రోజు కేసీఆర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో అప్పట్లో కలకలం సృష్టించింది. ఎన్నికల్లో ఓడిన మంత్రులకు మళ్ళీ బెర్త్ వుండబోదని కేసీఆర్ తెగేసి చెప్పిన మాట.. పార్టీలో చర్చకు తావిచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్.. వీళ్ళు ఎన్నికల్లో ఓడిన తెరాస మంత్రులు.
 
మిగతా వాళ్ల విషయం అటుంచితే.. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి పాలైన తుమ్మల మీద అందరి దృష్టి పడింది. అన్ని జిల్లాల్లోకీ ఖమ్మంలో మాత్రమే పార్టీ ఓటుబ్యాంకు తగ్గి ప్రతిష్ట దిగజారినందుకు కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో తుమ్మల నొచ్చుకున్నట్లు కూడా సమాచారముంది. వెంటనే మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన బంగళాను ఖాళీ చేయడానికి తుమ్మల సమాయత్తమయ్యారు. ఈ విషయం తెలిసి.. 'తొందరపడకండి.. సార్ మాట్లాడతారట' అంటూ సీఎం ఆఫీస్ నుంచి తుమ్మలకు సందేశం వచ్చినట్లు మీడియాలో వార్తలొచ్చేశాయి.
 
ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరికి కేబినెట్ పదవి దక్కబోతోందని, అందులో తుమ్మల కూడా ఒకరని అప్పటికే అనఫీషియల్ న్యూస్ చక్కర్లు కొట్టేస్తోంది. తుమ్మలను కౌన్సిల్ రూట్ ద్వారా క్యాబినెట్లోకి తీసుకోవాలని, తద్వారా ఖమ్మం జిల్లా మీద పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ భావించినట్లు చెబుతున్నారు. జిల్లా మొత్తం పలుకుబడి వున్న తుమ్మల కోసం 'ఆ మాత్రం' చేయక తప్పదని పార్టీ కూడా భావిస్తోంది. ఈ స్కెచ్ గీసింది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని తెలుస్తోంది. కానీ.. ఓడిన శాల్తీలని పక్కన బెట్టుకునే ప్రసక్తే లేదన్న 'నాన్న ఒట్టును' కేటీఆర్ గట్టున పెట్టేశారా?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com