విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం: చంద్రబాబు

- December 25, 2018 , by Maagulf
విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం: చంద్రబాబు

అమరావతి: హాస్టల్లో విద్యార్థుకు కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు... సాధించిన ప్రగతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రియల్‌టైమ్‌లో సంక్షేమ కార్యక్రమాల్ని, పథకాల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. మనం చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయని సీఎం పేర్కొన్నారు. ఆదరణ పథకం కింద పెద్దఎత్తున పనిముట్లను అందిస్తున్నామని, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. సుస్థిర వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

2014 ముందు ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండేవి..? లోటు బడ్జెట్‌ ఉన్నా ఇప్పుడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు... అమలు చేస్తున్నామనేది బేరీజువేసుకోవాలని చంద్రబాబు అన్నారు. గరిష్టస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఇకముందు కూడా... మెరుగ్గా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయగలమో ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. కొందరు ఇస్తున్న బూటకపు హామీలకన్నా... అమలవుతున్న పథకాలు ఎంతో మెరుగైనవని చంద్రబాబు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com