రైల్వే ప్రయాణికుల కోసం IRCTC పాడ్ హోటల్

- December 27, 2018 , by Maagulf
రైల్వే ప్రయాణికుల కోసం IRCTC పాడ్ హోటల్

ఐఆర్సీటీసీ త్వరలో తన పాడ్ హోటల్ ప్రారంభించనుంది. ఈ హోటల్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండనుంది. ప్రయాణికులు ఇందులో బస చేయవచ్చు. ప్రయాణికులకు తక్కువ ఖర్చులో మెరుగైన సౌకర్యాలు అందించనున్నట్టు రైల్వేలు తెలిపాయి. దేశంలో మొట్టమొదటి పాడ్ హోటల్ ముంబైలోనే ఏర్పాటు చేశారు. దీనిని అంధేరీ ప్రాంతంలో ప్రారంభించారు.

తాము మొత్తం 30 పాడ్ కాప్సూల్ హోటళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు ఐఆర్సీటీసీ ప్రతినిధి, మహారాజా ఎక్స్ ప్రెస్ కార్పొరేట్ సేల్స్ మేనేజర్ పినాకిన్ మోర్వాలా తెలిపారు. ఈ ప్రతిపాదనను ఎంపిక చేయడం పూర్తయిందని, ఇందుకోసం భూమిని కూడా అన్వేషించామని చెప్పారు. పాడ్ హోటల్ ఏర్పాటు ప్రతిపాదనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెస్టర్న్ రైల్వే ఆమోదం పొందడమే తరువాయన్నారు. ఆమోద ముద్ర పడగానే పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

పాడ్స్ లో ఈ సౌకర్యాలు లభిస్తాయి 
ఈ పాడ్స్ అన్ని ఎయిర్ కండిషన్ వే అయి ఉంటాయి. వీటిలో లైట్ కంట్రోల్, వైఫై, ఎంటర్ టైన్ మెంట్ కోసం చిన్న టీవీ, ఇంటర్ కామ్, పర్సనల్ లాకర్స్, పవర్ సాకెట్, యుఎస్బీ పోర్ట్, ఇతర సదుపాయాలు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నీ ప్రయాణికులను పాడ్స్ దిశగా ఆకర్షిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-ప్రతి పాడ్ 7 అడుగుల పొడవు ఉంటుంది.
-ఇందులో ప్రయాణికులు సులువుగా 7-8 గంటలు బస చేయవచ్చు
-పాడ్స్ హోటల్ లో డైనింగ్ ఫెసిలిటీ, వాష్ రూమ్, లాంజ్, చేంజింగ్ రూమ్ కూడా ఉంటాయి.

ఈ పాడ్ లో బస చేసేందుకు రైల్వే ఎంత చార్జి వసూలు చేసేది తెలియజేయ లేదు. ప్రస్తుతం ముంబైలోని అంధేరీలో ఉన్న పాడ్ హోటల్ లో బసకు రూ.2,500 చార్జి చేస్తున్నారు. కొత్త పాడ్ లకు కూడా దాదాపుగా అంతే మొత్తం వసూలు చేసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com