జ్యూస్‌ విక్రయిస్తున్న చిన్నారి: మినిస్ట్రీ ఆరా

- December 28, 2018 , by Maagulf
జ్యూస్‌ విక్రయిస్తున్న చిన్నారి: మినిస్ట్రీ ఆరా

మస్కట్‌: ఒమన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ, జ్యూస్‌ విక్రయిస్తున్న ఒమనీ చిన్నారి కోసం ఆరా తీస్తోంది. జ్యూస్‌ని విక్రయిస్తున్న ఆ చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విలాయత్‌ ఆఫ్‌ బార్కాలో ఆ చిన్నారి జ్యూస్‌ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతానికి అధికారుల్ని పంపించామనీ, అయితే అక్కడ ఆమె కన్పించలేదని మినిస్ట్రీ తెలిపింది. ఫ్యామిలీ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, యాంటీ బెగ్గింగ్‌ టీమ్‌ ఆ చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోందని తెలిపిన అధికారులు, ఆమెను ఆదుకునేందుకు అన్ని చర్యలూ చేపడతామని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com