మళ్లీ సునామీపై వదంతులు : ఆస్కారం లేదన్న ప్రభుత్వం

- December 28, 2018 , by Maagulf
మళ్లీ సునామీపై వదంతులు : ఆస్కారం లేదన్న ప్రభుత్వం

జకార్తా: గత శనివారం నాడు భారీ విధ్వంసాన్ని సృష్టించిన సునామీకి కారణమైన అగ్నిపర్వతం అనక్‌ క్రకటావ్‌ విస్ఫోటనాలు ఇంకా కొనసాగుతుండటంతో మరోసారి సునామీ సంభవించే అవ కాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం దీన్ని తోసి పుచ్చింది. సుమత్రా, జావా దీవుల మధ్య వున్న ఈ అగ్నిపర్వత విస్ఫోటనాలు క్రమంగా విస్తరిస్తుండటంతో ఇండోనేషియా ప్రభుత్వం సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. అనక్‌ క్రకటావ్‌ ప్రమాద హెచ్చరికల స్థాయిని రెండో స్థాయికి పెంచటంతో పాటు 'నోగో జోన్‌'ను మూడు మైళ్లకు పైగా విస్తరించినట్లు ఇండోనేషియా వోల్కనాలజీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారంనాటి సునామీ సంభవించిన సుందా జలసంధి ప్రాంతంలో నివసించే ప్రజలు తీరానికి కనీసం కిలోమీటరు దూరంలో వుండాలని హెచ్చరిం చింది.

విమానాల దారి మళ్లింపు 
సుమత్రా-జావా దీవుల మధ్య ప్రకటించిన 'నోగో జోన్‌'కు ఐదు కి.మీ పరిధిలో ప్రయాణించే విమానాలన్నింటినీ ఇండోనేషియా అధికారులు దారి మళ్లించారు. ప్రమాద ప్రాంత పరిధిని రెండు కి.మీ నుండి 5 కి.మీకి పెంచామని, ఈ పరిధిలో ప్రజలు, పర్యాటకులు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టరాదని ఇండోనేసియా విపత్తు నిర్వహణా సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే విధంగా ఇండోనేసియాకు వచ్చి, పోయే విమానాలన్నింటినీ ఈ ఐదు కి.మీ పరిధికి వెలుపలే ప్రయాణించే విధంగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com