రెండుగా చీలనున్న ఆర్ఆర్ఆర్ !?
- December 28, 2018
'ఆర్ ఆర్ ఆర్' రెండవ షెడ్యూల్ కు రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఒకవైపు కార్తికేయ పెళ్లి వ్యవహారాలను చూసుకుంటూనే మరొకవైపు త్వరలో ప్రారంభం కాబోతున్న 'ఆర్ ఆర్ ఆర్' రెండవ షెడ్యూల్ లో తీయవలసిన సీన్స్ కోసం రాజమౌళి తన టీమ్ మెంబర్స్ తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథ 1930 నుండి 2019 వరకు కొనసాగుతుంది కాబట్టి అనేక ట్విస్ట్ లు ఈకథలో ఉండబోతున్నాయి. దీనితో ఈమూవీ కథకు సంబంధించిన ట్విస్ట్ లలో క్లారిటీ లోపించకుండా అవసరం అనుకుంటే ఈమూవీని కూడ రెండు భాగాలుగా తీయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు టాక్.
ఇప్పటికే ఈ విషయమై రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 'బాహుబలి' రెండు పార్ట్ లలో తీసిన సందర్భంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ట్విస్ట్ ఉన్నట్లుగా 'ఆర్ ఆర్ ఆర్' కథకు సంబంధించి కూడ ప్రేక్షకులను విపరీతంగా ఆలోచింప చేసే ఒక ట్విస్ట్ దొరికితే ఈమూవీని కూడ రెండు పార్ట్స్ గా తీయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు.
దీనికితోడు ఈమూవీని రెండు పార్ట్స్ గా తీయడం వల్ల లాభాలు కూడ విపరీతంగా వస్తాయని అందువల్ల ఈమూవీకి అనుకోకుండా బడ్జెట్ పెరిగినా ఎటువంటి నష్టం ఉండదు అన్న కోణంలో రాజమౌళి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ముగిసేలోగా ఈవిషయం పై ఒక నిర్ణయానికి రావాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే జూనియర్ చరణ్ లు రెండు సంవత్సరాల పాటు రాజమౌళి బంధిఖానాలో ఉండి పోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







