అల్లు శిరీష్ 'ఎబిసిడి' ఫస్ట్ లుక్.!
- December 28, 2018
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. వెండి తెరపై తమ టాలెంట్ తో మాస్ ఇమేజ్ సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ నటించిన చిత్రాలు దాదాపు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ తనదైన టైమింగ్ తో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక గౌరవం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఆ చిత్రంతో ఘోర పరాజయం పొందాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో 'కొత్తజంట'మినహా అన్ని చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నాడు. ఆ మద్య మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయాడు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ABCD'కి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగులో కూడా అదే టైటిల్ 'ABCD'తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా 'పెళ్లిచూపులు' నిర్మాత యశ్ రంగినేని, మధుర' శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూఎస్ నుండి విహార యాత్రకి ఇండియాకి వచ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి తన జీవితంలో ఎదురైన సంఘటలని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడనేది చిత్రంలో ఆసక్తికరంగా చూపించనున్నారట. రుక్సార్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, కోట శ్రీనివాసరావు, శుభలేక సుధాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..