విశాఖ లో ఎయిర్ షో రద్దు
- December 28, 2018
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. 'విశాఖ ఉత్సవ్' పేరుతో ప్రతీ ఏటా ఏపీ ప్రభుత్వం సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలను చేపట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్రీడలు, జానపద నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో అలరించనున్న ఈ వేడుకలకు తాజాగా కేంద్రం షాక్ ఇచ్చింది. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షోను రద్దు చేసింది కేంద్రం. ఇందులో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనీ, రిహార్సల్స్ పూర్తి చేశాక సిబ్బందిని వెనక్కు పిలిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఏర్పాట్లు పూర్తి కాకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ ఆలస్యంగా స్పందించిందని అంటున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!