ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం..
- December 29, 2018
ఫిలిప్పీన్స్ లో ని మిందానావో ద్వీపంలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. మిందానావో ద్వీపంలోని జనరల్ శాంటోస్ అనే నగరానికి 193కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భూకంప కేంద్రానికి 300కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చిరికలు జారీ చేశారు. దీంతో.. సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
తీరప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఫిలప్పీన్స్ తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.
ఇటీవల ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో భారీ సునామి సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..