గగన్‌యాన్: అంతరిక్షంలోకి భారత్ వ్యోమగాములు
- December 29, 2018
ఢిల్లీ : అంతరిక్ష ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఎన్నాళ్లో పెండింగ్‌లో ఉన్న గగన్‌యాన్ ప్రయోగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'గగన్‌యాన్' ప్రయోగానికి రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. డిసెంబర్ 28వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలియచేశారు.
ముగ్గురు భారత వ్యోమగాములు...
మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు భారతీయ వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లనున్నారు. వీరు అంతరిక్షంలో ఏడు రోజులు ఉంటారు. ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 నాటికి గగన్‌యాన్ ప్రయోగాన్ని చేసి తీరుతామని గతంలోనే ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. 2022 నాటికి భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, రష్యా, చైనా ఇలాంటి ప్రయోగాలు జరిపింది. ఈ ప్రయోగాన్ని ISRO సక్సెస్ చేస్తే ఇండియా నాలుగో దేశంగా కీర్తిపుటల్లో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!