సరికొత్త సినీ ఇండస్ట్రీ 'స్మార్ట్ మల్టీప్లెక్స్'..!
- December 29, 2018
గంట నిడివిగల సినిమాలనే 'స్మార్ట్ సినిమా'గా చెబుతూ సరికొత్త కాన్సెప్టుతో సరికొత్త సినీ ఇండస్ట్రీకి తెరలేపుతోంది 'స్మార్ట్ మల్టీప్లెక్స్'. వారంకు ఓ స్మార్ట్ సినిమాను విడుదల చేస్తూ, వెబ్‌సిరీస్‌లు, గేమ్‌షోలు, రియాల్టీ షోలతో నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు 'స్మార్ట్ మల్టీప్లెక్స్' వచ్చేసింది. ఇది డిజిటల్ మూవీ ప్లాట్ ఫామ్.
ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై సినిమాలతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ కూడా ఉంటుంది. ఫుడ్ డెలివరీ కూడా అందుబాటులో ఉంటుంది అందుకే 'స్మార్ట్ మల్టీప్లెక్స్'గా పిలువబడుతోంది. ఇందులో విడుదలయ్యే సినిమాలను ప్రేక్షకుడు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, హోమ్ స్క్రీన్ థియేటర్, డెస్క్‌టాప్‌లలో చూడవచ్చు. భారీ నిడివి లేకుండా 60 నుంచి 90 నిమిషాల నిడివితో తీసిన సినిమాలను 'స్మార్ట్ సినిమా'లు పిలుచుకుంటూ వాటిని విడుదల చేస్తుంది ఈ డిజిటల్ వేదిక.
smartmultiplex.com లో స్మార్ట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు, స్మార్ట్ ఫిల్మ్ లు కూడా ఉంటాయి. ప్రేక్షకుడికి రిజిస్ట్రేషన్‌తో పాటు సబ్‌స్క్రిప్షన్ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న మొట్టమొదటి మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇదే. లోకల్ కంటెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇటు ప్రేక్షకుడిని, అటు స్మాల్ బడ్జెట్ మూవీ మేకర్‌ని 'స్మార్ట్ మల్టీప్లెక్స్' ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







