న్యూయార్క్ ఆకాశంలో వింత కాంతి.. మానవాతీత శక్తులే కారణమా?
- December 29, 2018
న్యూయార్క్ నగరంపై ఆకాశంలో గురువారం రాత్రి వింత కాంతి కనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రజలంతా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ప్రకాశవంతమైన ఆకుపచ్చ, ఊదా రంగుల మిశ్రమ నీలి వర్ణ కాంతి ఏలియన్స్ రాకకు సంకేతమని కొందరు చర్చలు మొదలు పెట్టారు. ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు.. వాటిలో కనిపించిన కాంతిని ఈ కింది వీడియోలో చూడండి..కానీ, ఇది ఒక పవర్ స్టేషన్ పేలుడు వల్ల వచ్చిన కాంతి అని పోలీసులు తెలిపారు.
ఈ మెరుపు కాంతికి మానవాతీత శక్తులే కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. న్యూయార్క్ నగరంపై దేవుడు ఏదో పనిలో ఉన్నాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే, ఇదంతా మానవాతీత శక్తుల పని కాదని, భూమిపై జరిగిన ప్రమాదమని న్యూయార్క్ పోలీసు విభాగం స్పష్టం చేసింది.
న్యూయార్క్ చుట్టుపక్కల ఉన్న ఐదు పట్టణాల్లో ఒకటైన క్వీన్స్ సమీపంలోని అస్టోరియా ప్రాంతంలో కాన్ ఎడిసన్ పవర్ స్టేషన్‌లో ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు వల్లనే ఈ కాంతి కనిపించిందని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఈ కాంతిపై ప్రజల్లో ఏర్పడిన ఆసక్తి, ఆందోళనల నేపథ్యంలో కాన్ ఎడిసన్ కంపెనీ కూడా స్పందించింది. స్వల్ప అగ్ని ప్రమాదం వల్లనే ఇదంతా జరిగిందని వెల్లడించింది. న్యూయార్క్‌లోని లగార్డియా విమానాశ్రయంపై విద్యుత్ కోత ప్రభావం పడింది. విమానాల రాకపోకలు ఆలస్యం కావొచ్చునని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!