దుబాయ్ క్రికెట్ స్టేడియంలో రాహుల్‌గాంధీ ప్రసంగం
- December 31, 2018
దుబాయ్: భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రసంగించనున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు దేశానికి విచ్చేస్తోన్న రాహుల్, జనవరి 11న సాయంత్రం 4 గంటలకు స్టేడియంలో మాట్లాడతారు. భారత కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ హిమాన్షు వ్యాస్ మాట్లాడుతూ, స్టేడియంలో రాహుల్ సభకు పర్మిషన్ లభించిందని చెప్పారు. 'గాంధీ 150 ఇయర్స్: ది ఐడియా ఆఫ్ ఇండియా' పేరుతో ఈ వెంట్‌ని నిర్వహిస్తున్నారు. అలాగే రాహుల్‌గాంధీ, ఇండియన్ బిజినెస్ మరియు ప్రొఫెషనల్ కౌన్సిల్ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని, స్టూడెంట్స్ గ్రూప్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. అబుదాబీలోని షేక్ జాయెద్ మాస్క్‌ని కూడా సందర్శిస్తారు రాహుల్‌గాంధీ. ఐఎస్సిలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు బి.ఆర్.శెట్టి పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన పట్ల యూఏఈలోని భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు సమన్వయకర్తగా ఎస్.వీ. రెడ్డి (TPCC NRI CELL CONVINER UAE) మరియు సంతోష్,మారుతి, కె.వీ.రెడ్డి, కార్తిక్, శ్రీధర్, గోవర్ధన్ కో-ఆర్డినేషన్ కమిటీ మెంబర్లుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!