రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారి సేవకు..
- December 24, 2015
తిరుమలలో టీటీడీ ఘనంగా ఏర్పాట్లు తిరుమల: శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం తిరుమల రానున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన కోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లుచేసింది. ఇందులో భాగంగా ఆయన విడిది చేయనున్న పద్మావతి అతిథి గృహంలోని గదులను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది. ఈ ఏర్పాట్లను జేఈవో శ్రీనివాసరాజు స్వయంగా పరిశీలించారు. అన్నీ సవ్యం గా ఉన్నాయా? లేవా? గుర్తించి రిసెప్షన్ అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రపతితో పాటు వస్తున్న గవర్నర్ నరసింహన్ కోసం కేటాయించిన శ్రీకృష్ణ, సీఎం చంద్రబాబు కోసం కేటాయించిన లైలావతి అతిథి గృహాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలకు బస, దర్శనం, అన్నప్రసాదాల విషయంలో ఎలాంటి లోటులేకుండా చూడాలని జేఈవో సంబంధిత అధికారులకు ఆదేశించారు. జేఈవో వెంట అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ-2 రామచంద్రారెడ్డి, రిసెప్షన్ అధికారులు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఝాన్సీ, లక్ష్మీనారాయణయాదవ్, డెప్యూటీ ఈవో సాగివేణుగోపాల్, శాస్త్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట పాల్గొన్నారు. వరాహస్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పుచోటుచేసుకుంది. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అదే సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరాహస్వామి దర్శనానంతరం శ్రీవారిని దర్శించుకంటారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









