న్యూ ఇయర్‌ ఈవ్‌: దుబాయ్‌లో రోడ్‌ క్లోజర్స్‌ ఇవే

- December 31, 2018 , by Maagulf
న్యూ ఇయర్‌ ఈవ్‌: దుబాయ్‌లో రోడ్‌ క్లోజర్స్‌ ఇవే

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ న్యూ ఇయర్‌ ఈవ్‌ సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో కొన్ని చోట్ల రోడ్‌ క్లోజర్స్‌ని తాత్కాలికంగా ప్రకటించింది. 2 మిలియన్‌ పీపుల్‌ ఈ వేడుకల్లో పాల్గొంటారన్న అంచనాల నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా, ఎలాంటి ప్రమాదాలకూ ఆస్కారం లేకుండా ఈ చర్యలు చేపట్టారు. దుబాయ్‌ మాల్‌, బుర్జ్‌ ఖలీఫా వంటి ప్రాంతాలకు వెళ్ళేందుకు ముందుగానే బయల్దేరాల్సి వుంటుందని ట్రాఫిక్‌ అధికారులు సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి రోడ్‌ క్లోజర్స్‌ అమల్లో వుంటాయి. అల్‌ అసాయెల్‌ స్ట్రీట్‌, హ్యాపీనెస్‌ స్ట్రీట్‌, ఫైనాన్షియల్‌ సెంటర్‌ రోడ్‌, అల్‌ సుకౌక్‌ స్ట్రీట్‌లు ఇందులో వున్నాయి. కొన్ని రోడ్స్‌లో క్లోజర్స్‌ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్‌ అవుతోంటే, ఇంకొన్ని 8 గంటలకు స్టార్ట్‌ అవుతాయి. ఇదిలా వుంటే, బుర్జ్‌ ఖలీఫా సహా పలు ప్రాంతాలకు న్యూ ఇయర్‌ ఈవ్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఇప్పటికే ఔత్సాహికులు తరలి వెళుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com