దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: పాకిస్తానీ సెలబ్రిటీ మథిరాకి తీవ్ర గాయాలు

- January 02, 2019 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: పాకిస్తానీ సెలబ్రిటీ మథిరాకి తీవ్ర గాయాలు

ప్రముఖ పాకిస్తానీ వీజే, హోస్ట్‌ మరియు మోడల్‌ అయిన మథిర, ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. డిసెంబర్‌ 31న మథిర ప్రయాణిస్తున్న కారుని రెండు ట్రక్కులు దుబాయ్‌ రోడ్డుపై ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని తేలింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలికి కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫఞటోల్ని మథిర సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలే తనను కాపాడాయని మథిర చెప్పారు. మథిర, 2013లో దుబాయ్‌కి చెందిన డిజె, పంజాబీ సింగర్‌ ఫ్లింట్‌ జెని పెళ్ళాడారు. అయితే 2018లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com