క్రూయిజ్ టూరిజం: 100,000 విజిటర్స్
- January 02, 2019
మస్కట్: సుల్తాన్ కబూస్ పోర్ట్ నుంచి గత నాలుగు నెలల్లో సుమారు 100,000 మంది విజిటర్స్ ఒమన్‌కి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పోర్ట్ ఆపరేటింగ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం సుల్తాన్ కబూస్ పోర్ట్‌లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 50కి పైగా షిప్‌లు డాక్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ప్రారంభమైన 2018-2019 టూరిస్ట్ సీజన్‌కి సంబంధించి సగం దూరంలో వున్నామనీ, సుల్తాన్ కబూస్ పోర్ట్ సుమారుగా 98,432 మంది టూరిస్టుల్ని తీసుకొచ్చిందని మరాఫి వివరించింది. హరిజాన్, కోస్టా మెడిటేరినియా, ఏజీయన్ ఓడిస్సీ, ఎయిడ్ అప్రిమా, ఎంఎస్సి స్ప్లెండా, ఎంఎస్సి లిరికా, మెయిన్ షిఫ్ 4 తదితర క్రూయిజ్ షిప్‌లు ఒమన్‌కి వచ్చాయి. నవంబర్‌లో మరాఫి రెండు రోజుల టర్న్ ఎరౌండ్ ఆపరేషన్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో 900 మంది యూకే నుంచి వచ్చిన టూరిస్టులకు స్వాగతం పలికారు. ఈ సీజన్లో మొత్తం 147 షిప్‌లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..