షార్జాలో భారీ అగ్ని ప్రమాదం

- January 02, 2019 , by Maagulf
షార్జాలో భారీ అగ్ని ప్రమాదం

షార్జా ఇండస్ట్రియల్‌ ఏరియా వన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే భారీగా మంటలు, పొగలు పైకి లేచాయి. సంఘటన గురించి సమాచారం అందుకోగానే వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న షార్జా సివిల్‌ డిఫెన్స్‌ చాకచక్యంగా మంటల్ని ఆర్పివేయగలిగాయి. పొగ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైనవారికి ప్రాథమిక చికిత్స అందించారు. రాత్రి 9.58 నిమిషాల సమయంలో సమాచారం అందిందనీ, వెంటనే సహాయ బృందాల్ని సంఘటనా స్థలానికి పంపించామని అధికారులు పేర్కొన్నారు. రికార్డు సమయంలో మంటల్ని ఆర్పివేయడం వల్ల, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com