క్రూయిజ్‌ టూరిజం: 100,000 విజిటర్స్‌

- January 02, 2019 , by Maagulf
క్రూయిజ్‌ టూరిజం: 100,000 విజిటర్స్‌

మస్కట్‌: సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌ నుంచి గత నాలుగు నెలల్లో సుమారు 100,000 మంది విజిటర్స్‌ ఒమన్‌కి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పోర్ట్‌ ఆపరేటింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌లో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 50కి పైగా షిప్‌లు డాక్‌ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ప్రారంభమైన 2018-2019 టూరిస్ట్‌ సీజన్‌కి సంబంధించి సగం దూరంలో వున్నామనీ, సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌ సుమారుగా 98,432 మంది టూరిస్టుల్ని తీసుకొచ్చిందని మరాఫి వివరించింది. హరిజాన్‌, కోస్టా మెడిటేరినియా, ఏజీయన్‌ ఓడిస్సీ, ఎయిడ్‌ అప్రిమా, ఎంఎస్‌సి స్ప్లెండా, ఎంఎస్‌సి లిరికా, మెయిన్‌ షిఫ్‌ 4 తదితర క్రూయిజ్‌ షిప్‌లు ఒమన్‌కి వచ్చాయి. నవంబర్‌లో మరాఫి రెండు రోజుల టర్న్‌ ఎరౌండ్‌ ఆపరేషన్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో 900 మంది యూకే నుంచి వచ్చిన టూరిస్టులకు స్వాగతం పలికారు. ఈ సీజన్‌లో మొత్తం 147 షిప్‌లు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com