ఇంటా బయటా సంచలనాలు సృష్టిస్తున్న కె.జి.ఎఫ్
- January 02, 2019
కన్నడ నటుడు యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందిన పీరియాడికల్ మూవీ, కె.జి.ఎఫ్... ఈనెల 21న కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అయ్యింది. కంటెంట్ మరీ కొత్తదేం కాకపోయినా, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, ఇంతకుముందెప్పుడూ స్ర్కీన్‌పై చూడని బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కడంతో, ఆడియన్స్ కొత్తగా ఫీలయ్యి, కె.జి.ఎఫ్ మూవీని చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో అదరగొడుతుంది కె.జి.ఎఫ్.
హిందీ వెర్షన్ కూడా బాగా వసూలు చేస్తోంది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ జీరో మూవీపై, కె.జి.ఎఫ్‌దే పై చేయి కావడం విశేషం. ఇప్పుడీ సినిమాని సింగపూర్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. జనవరి 3న, సింగపూర్‌లోని కొన్ని ఏరియాల్లో, కె.జి.ఎఫ్. హిందీ వెర్షన్‌ని భారీగా రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రూ. 150 కోట్లకి పైగా షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. కన్నడ ఇండస్ట్రీలో, రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్ట మొదటి సినిమాగా కె.జి.ఎఫ్. రికార్డ్ క్రియేట్ చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







