కేటీఆరే స్పూర్తి తో రాజకీయాల్లోకి వస్తా : ప్రకాష్ రాజ్
- January 02, 2019
హైదరాబాద్: తన రాజకీయ ప్రయాణానికి కేటీఆర్ స్పూర్తి అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన మరునాడే సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం నాడు హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.తన రాజకీయ ప్రయాణం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని ఆయన తేల్చి చెప్పారు. గతంలో కేసీఆర్‌తో కలిసి ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడలను కలిశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ గతంలో పలుమార్లు ప్రశంసలు కురిపించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయమై ఆయన త్వరలోనే వెల్లడించనున్నట్టు ప్రకాష్ రాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!