నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

- January 03, 2019 , by Maagulf
నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

పంజాబ్‌ జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గురువారం నుంచి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. జనవరి 3 నుండి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. చాయ్ పే చర్చలో భాగంగా ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలతో ప్రధాని చర్చించనున్నారు. సాంకేతిక ఫలాలను సామాన్యుడి చెంతకు చేర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.

దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగనుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో దేశంలోని ఎదో ఒక పట్టణంలో జరుగుతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com