ఒమన్‌లో కొత్త ఫిష్‌ మార్కెట్‌ ప్రారంభం

- January 03, 2019 , by Maagulf
ఒమన్‌లో కొత్త ఫిష్‌ మార్కెట్‌ ప్రారంభం

600,000 ఒమన్‌ రియాల్స్‌ ఖర్చుతో నిర్మించిన కొత్త ఫిష్‌ మార్కెట్‌ని ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రిక్లచర్‌ అండ్‌ ఫిషరీస్‌ ఈ మార్కెట్‌ని ప్రారంభించింది. మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ హమెద్‌ అల్‌ అవుఫి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో, 1,530 బిల్డింగ్‌ ఏరియాలో దీన్ని నిర్మించారు. మోడ్రన్‌ సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌తోపాటు, 32 డిస్‌ప్లే టేబుల్స్‌ అలగే 16 కటింగ్‌ టేబుల్స్‌ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరు షాపులు ఈ మార్కెట్‌లో వుంటాయి. స్టోరేజ్‌ వేర్‌ హౌస్‌లనూ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్‌తో మినిస్ట్రీ సూపర్‌ వైజ్డ్‌ మార్కెట్స్‌ సంఖ్య 60కి చేరుకుంది. ఇవి కాక 650 ఫిష్‌ ఔట్‌లెట్స్‌ మరియు స్టోర్స్‌ సుల్తానేట్‌లో వున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com