సినీ దిగ్గజాలపై ఐటీ దాడులు..జీర్ణించుకోలేని ఫ్యాన్స్
- January 03, 2019
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సినీ దిగ్గజాల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నివాసంతో పాటు... ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అయిన సినీనటి రాధిక నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో సుదీప్ నివాసంతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోని దాదాపు 10 మంది సినీ దిగ్గజాలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్‌ను కూడా వదలని ఐటీ అధికారులు... కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ సహా శివ్ రాజ్‌కుమార్, సీఆర్ మనోహర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టాప్ హీరోను టార్గెట్ చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!