బిగ్ బాస్ -3 హోస్ట్ గా మారనున్న వెంకీ?
- January 03, 2019
బిగ్ బాస్ సీజన్-1 తెలుగు నాట పెద్ద సక్సెస్ అయింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్వవహరించిన ఈ షో కంటెస్టెంట్లు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కావడంతో అందరికీ బాగా కనెక్ట్ అయింది. విన్నర్ గా నటుడు శివ బాలాజీ నిలిచాడు. ఇక సీజన్-2 వివాదాలతో ముగిసింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా ప్రారంభమైన గేమ్ షో ఆరంభం దగ్గర నుంచే వివాదాలతో అట్టడుకింది. కొంతమంది కంటెస్టెంట్లు ఆడియన్స్ కు తెలిసిన వాళ్లు కాకపోయినా కాంట్రవర్శృస్ తో చోటు చేసుకోవడంతో. ఆవిధంగా షోకు క్రేజ్ వచ్చింది. నానికి ఈ షో గొప్ప ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చింది. ఇలాంటి అవకాశం మళ్లీ వచ్చి..ఎన్నికోట్లు ఆఫర్ చేసినా తిరస్కరిస్తానని చివరి రోజు చెప్పేసాడు. సీజన్ -2 విన్నగా కౌశల్ గెలిచాడు.
అయినా ఇప్పటికి కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ -3కి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సారి సీటీకి దూరంగా సెట్ వేస్తున్నట్లు సమాచారం. మరి సీజన్ -3కి హోస్ట్ ఎవరంటే? ఇప్పటికే కొంత మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. సాధారణంగా హోస్ట్ బాధ్యతలనేవి చాలా కీలకమైనవి. అక్కడ పరిస్థితులును బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సిచ్వేషన్ కు తగ్గట్టు మాట్లాడాల్సి ఉంటుంది. సీజన్-1 లో ఎన్టీఆర్ చాలా తెలివిగా హోస్టింగ్ చేసాడు.
కానీ సీజన్-2 నాని గేమ్ ను బ్యాలెన్స్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో నానిపై అభిమానులు, ప్రేక్షకులు దాడికి దిగారు. సీజన్ -3లో అలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారుట. దీనిలో భాగంగా విక్టరీ వెంకటేష్ అయితేనే బాగుంటుదనుకుంటున్నారు. పైగా ఇప్పుడాయనకు సినిమాలు కూడా పెద్దగా లేవు. కాబట్టి అన్ని రకాలుగా అందుబాటులో ఉండగలడు. తెలివిగా మాట్లాడగలడు. పైగా ఇప్పటివరకూ వెంకటేష్ బుల్లి తెరపై ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. చిరంజీవి, నాగార్జున లను సైతం హోస్ట్ గా చేసారు. కానీ వెంకీకి ఆఛాన్స్ రాలేదు. వెంకీ అయితే షో కు ఇంకాస్త పాపులారిటీ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఛాన్స్ వస్తే మాత్రం వెంకీ మిస్ చేసుకోడని వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







