15 మిలియన్ దిర్హామ్‌ల లాటరీ: ప్రాంక్ కాల్ అనుకున్నానంటోన్న ఇండియన్
- January 03, 2019
15 మిలియన్ దిర్హామ్‌ల లాటరీని బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గెల్చుకున్న ఇండియన్, తాను ఇంకా ఈ వాస్తవాన్ని నిజమని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. శరత్ పురుషోత్తమన్ అనే భారత వలసదారుడు, బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద మొత్తమైన 15 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న సంగతి తెల్సిందే. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఈ డ్రా నిర్వహించారు. విజేతకు పలుమార్లు ఫోన్ చేశామనీ, అయితే అది నిజమని ఆయన తొలుత నమ్మలేదని బిగ్ టికెట్ అబుదాబీ డ్యూటీ ఫ్రీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షెరిల్ ఫజార్డో చెప్పారు. 083733 నెంబర్ టిక్కెట్‌పై ఈ బహుమతి పురుషోత్తమన్‌ని వరించింది. గెలిచిన విషయాన్ని తెలియజేయడం జరిగిందనీ, అయితే అది నిజమని ఒప్పించడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు అన్నారు. కాగా, రెండో ప్రైజ్ 100,000 దిర్హామ్‌లు కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి జినాచంద్రన్ వజూర్ నారాయణన్ గెల్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్‌కి చెందిన షాహిద్ ఫరీద్ మూడో బహుమతి గెలుచుకున్నారు. మొత్తంగా ఈ డ్రాలో 8 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్