రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి
- January 03, 2019
మస్కట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన దోఫార్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓవర్ టర్న్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దోఫార్‌లోని జబాల్ అల్ కమార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ అబ్దుల్లా బిన్ సలెహ్ బిన్ మొహమ్మద్ అల్ బలౌషి కాగా, మరొకరు కార్పొరల్ ఖామిస్ బిన్ సైఫ్ బిన్ మొహమ్మద్ అల్ ముక్బాలి. గాయపడ్డ వ్యక్తిని ముతాసిమ్ బిన్ హమాద్ బిన్ సలూమ్ అల్ బసామిగా గుర్తించారు. రాయల్ ఆర్మీ కమాండ్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ ఆర్మీ అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!