ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి.!
- January 05, 2019
ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి చేశాడు ఓ ఎమిరేటీ వ్యక్తి. 45 ఏళ్ల నిందితుడు తన 28 ఏళ్ల సోదరున్ని కత్తితో పొడిచాడు. తమ తండ్రికి చెందిన ఆస్థి విషయంలో కుటుంబంలో తలెత్తిన తగాదాలే ఈ దాడికి కారణం. బర్షాలో నిందితుడి తండ్రికి ఓ ఇల్లు ఉంది. ఇటీవల తండ్రి మృతి చెందాడు. దాంతో ఆ ఇంటి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో పంపకాల కోసం కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిందితుడు తీవ్ర ఆగ్రహానికి లోనై సోదరునిపై దాడి చేశాడు. కత్తితో దాడి చేసేందుకు తమ సోదరుడు ప్రయత్నించినా, అడ్డుకునేందుకు తాము కష్టపడాల్సి వచ్చిందనీ, అయితే తన మీద కత్తితో సోదరుడు దాడి చేశాడనీ బాధితుడు కోర్టుకు తెలిపాడు. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కేసును విచారిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..