స్కామ్ అలర్ట్: 500 ఎమిరేట్స్ ఫ్రీ టిక్కెట్స్ బోగస్
- January 05, 2019
యూఏఈ రెసిడెంట్స్, 500 ఎమిరేట్స్ ప్రీ టిక్కెట్స్ స్కామ్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఎమిరేట్స్ సంస్థ హెచ్చరించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఎమిరేట్స్ సంస్థ 500 ఉచిత ఎయిర్ టిక్కెట్స్ అందిస్తోందంటూ ఓ తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయమై ఎమిరేట్స్ సంస్థ స్పందించింది. ఇలాంటి మెసేజ్‌లనూ ఎవరూ నమ్మి మోసపోవద్దని పేర్కొంది. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఎమిరేట్స్ సంస్థ ఎలాంటి ఆఫర్స్ ప్రకటించినా అవన్నీ అధికారిక ప్లాట్ ఫామ్స్ మీదనే జరుగుతాయని పేర్కొన్నారు. వాట్సాప్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కొందరు ఈ తరహా మెసేజ్‌లను ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. 2017 సెప్టెంబర్‌లో ఓ ఫేక్ వెబ్ సైట్, ఓ సర్వే నిర్వహించి రెండు ఉచిత ఎయిర్ టిక్కెట్స్‌ని అందిస్తున్నట్లుగా పేర్కొని చాలామందిని మోసం చేసింది. అప్పుడూ ఎమిరేట్స్ సంస్థ తమ వినియోగదారుల్ని, పౌరుల్ని అలర్ట్ చేసింది. ఇలాంటి ఫేక్ విషయాల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని ఎవరికీ తెలియజేయరాదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..