ఫేస్బుక్ మెసేంజర్ నుంచి అదిరిపోయే ఫీచర్
- January 05, 2019
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఏడాది మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజర్‌లో త్వరలో డార్క్ మోడ్ పేరిట ఓ కొత్త ఫీచర్ లభ్యం కానుంది. అయితే పలు ఎంపిక చేసిన దేశాల యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ మొదట అందుబాటులోకి వస్తుంది.
జనవరిలో ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది.
అక్టోబర్‌లోనే ఫేస్‌బుక్ ప్రకటన
కాగా గతేడాది అక్టోబర్‌లోనే ఫేస్‌బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్నట్లు సమాచారం.
కాంతి అంతగా లేని ప్రదేశాల్లో
అది పూర్తి అయిన అనంతరం యూజర్లకు పూర్తి స్థాయిలో ఈ ఫీచర్ అప్‌డేట్‌ను ఇస్తారు. డార్క్ మోడ్ ఫీచర్ వల్ల రాత్రి పూట, కాంతి అంతగా లేని ప్రదేశాల్లో యూజర్లు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను మరింత సౌకర్యవంతంగా చూడవచ్చు.
కళ్లు సురక్షితం
దీని వల్ల తక్కువ కాంతి వెలువడుతుంది. కళ్లు సురక్షితంగా ఉంటాయి.అయితే ఇక ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను మెసెంజర్‌లో ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనేదానిపై ఎటువంటి క్లారిటీ లేదు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!