గల్ఫ్ మరణాల గణాంకాలు...
- January 06, 2019
ఢిల్లీ:గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. 2014 నుంచి 2018 మధ్య గల్ఫ్ దేశాలైన బహ్రైన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లలో 28,523 మంది భారత కార్మికులు మృతి చెందారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాటియాల ఎంపీ ధరమ్వీరా గాంధీ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ సమాధానమిచ్చారు. ఆయా దేశాల్లోని భారత ఎంబసీల వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. భారత కార్మికులు అధికంగా మృతి చెందిన గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా ఉంది. ఇక్కడ 2014-18 మధ్య 12,828 మంది కార్మికులు మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ(7,877 మంది) ఉన్నది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







