అలీ రాజకీయ ప్రయాణం పై పలు అనుమానాలు

అలీ రాజకీయ ప్రయాణం పై పలు అనుమానాలు

అమరావతి: ప్రముఖ హాస్య నటుడు అలీ, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్న వేళ, ఈ ఉదయం ఆయన స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. తన గురువు, మార్గదర్శకుడిగా పవన్ ను చెప్పుకునే అలీ, నేడు పవన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న అలీ, అందుకు సంబంధించి పవన్ సలహాలు అడిగి ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది.

Back to Top