నిమ్మకూరు వెళ్లనున్న బాలకృష్ణ,విద్యాబాలన్
- January 06, 2019
దివంగత నటుడు ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ ..నటి విద్యాబాలన్‌తో కలిసి రేపు పర్యటించనున్నాడు. ఈ మేరకు నిమ్మకూరులో ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలకృష్ణ మిత్రుడు బుర్రా గాంధీ మీడియాకు తెలిపారు. బాలకృష్ణ, విద్యాబాలన్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా రానున్నారని చెప్పారు. అక్కడ ముందుగా ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేశాక, 'ఎన్టీఆర్' రెండో భాగానికి సంబంధించిన ఓ సీన్ ను గ్రామంలో చిత్రీకరించనున్నారని చెప్పారు. హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో ఉంటారని చెప్పారు. రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని, ఆపై రోడ్డు మార్గంలో 10 గంటల సమయానికి నిమ్మకూరు చేరుకుంటారని వెల్లడించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్..బసవతారకంగా నటించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







