ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం
- January 06, 2019
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర బదాఖ్‌షాన్ ప్రావిన్స్‌లోని ఓ బంగారం గని కూలడంతో 30 మంది కార్మికులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లంతా గనిలో పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 20 మంది వరకు గాయపడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇలా గనులు కూలడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. స్థానిక గ్రామస్థులు బంగారం కోసమని నదీ తీరంలో 60 మీటర్ల లోతు వరకు గని తవ్వారు. అందులోకి వెళ్లి బంగారం కోసం అన్వేషిస్తుండగా గని కూలింది. ఈ గనిని తవ్విన వాళ్లు ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్ల అది కూలి ఉంటుందని ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి నిక్ మొహ్మద్ నజారీ చెప్పారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇక్కడి గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా గనులు తవ్వి బంగారం కోసం అన్వేషిస్తున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!