సౌదీకి పంపించొద్దు అంటున్న యువతి...
- January 07, 2019
సౌదీ అరేబియాకు చెందిన 18 ఏళ్ల రాహఫ్ అల్ కునన్ అనే అమ్మాయి .. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చిక్కుకున్నది. కువైట్‌లో ఉన్న తమ పేరెంట్స్ నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో ఆమె థాయిలాండ్ చేరుకున్నది. అయితే బ్యాంకాక్‌లోని ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను ఓ హోటల్లో బంధించారు. తిరిగి ఆ టీనేజర్‌ను కువైట్‌లో ఉన్న ఆమె పేరెంట్స్‌కు అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యులతో తనకు ప్రాణ హాని ఉందని, తాను ఇస్లామ్‌ను వదిలివేశానని, అందుకే ఆస్ట్రేలియా పారిపోతున్నట్లు ఆమె ఓ వీడియో సందేశంలో చెప్పింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థాయ్‌కు వెళ్లిన ఆ టీనేజర్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సౌదీ ఎంబీసీ అధికారులు ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ దేశమైనా తనకు ఆశ్రయం కల్పిస్తే అక్కడకి వెళ్తానని ఆమె తన వీడియో సందేశంలో కోరింది. ఇస్లామ్‌ను వదిలివేసి ఇంటికి వెళ్లిన వారిని దారుణంగా శిక్షిస్తారని, అందుకే తనకు కువైట్‌కు వెళ్లాలని లేదని ఆమె చెబుతోంది. ఐక్యరాజ్యసమితి తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతోంది. గత ఏడాది ఆరంభంలో కూడా ఓ మహిళ ఇలాగే కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించింది.
ఆమెను పిలిప్పీన్స్ నుంచి కువైట్‌కు పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆ మహిళ ఆచూకీ తెలియలేదు. అందుకే రాహఫ్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!