కొత్తిమీర తీసుకుంటే....
- January 08, 2019సాధారణంగా మనం వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను వాడుతూ ఉంటాం. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
1. కొత్తిమీర యాంటీ-ఆక్సిడేంట్స్ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.
2. చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది.
3. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ కూడా కొత్తిమీరలో అధికంగా ఉంటాయి.
4. కొత్తిమీర ఆహారాన్ని రుచిగానే కాకుండా, జీర్ణక్రియ స్థాయిని కూడా పెంచును. అంతేకాకుండా అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
5. కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఆపుతుంది.
6. కొత్తీమీరను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన కిడ్నీలలో వచ్చే రాళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు మరియు పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ను నివారించుకోవచ్చు.
7. కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం