సామూహిక నిరాహార దీక్షకు పాలస్తీనా ఖైదీలు సిద్ధం
- January 08, 2019
జెరూసలేం : జైళ్ళలో పరిస్థితులను మరింత అధ్వాన్నం చేసేలా కొత్త చర్యలు చేపట్టాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం భావిస్తోంది. అదే గనుక జరిగితే మూకుమ్మడిగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇజ్రాయిల్ జైళ్ళు, నిర్బంధ కేంద్రాలు, ఇంటరాగేషన్ కేంద్రాల్లోని వందలాదిమంది పాలస్తీనియన్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఖైదీలు, పాలనాపరమైన నిర్బంధితులు (ఎలాంటి అభియోగాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నవారు) ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కొత్త తరహా అణచివేత చర్య అని వారు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకోవడమంటే యుద్ధం ప్రకటించడమేనని, దీంతో తమ పోరాటంలో కొత్త దశ ఆరంభమైందని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. తమకు సంఘీభావంగా నిలబడాల్సిందిగా వారు పాలస్తీనా వర్గాలను, కార్యకర్తలను కోరారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. ఇజ్రాయిల్లో 5500 పాలస్తీనా ఖైదీలు వున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..