నడిచే కారు... వచ్చేసింది
- January 09, 2019కార్ల దిగ్గజం హ్యుండాయ్ నడిచే కారును తయారు చేసింది. ప్రమాదకరమైన రహదారుల్లో ప్రయాణించేందుకు ఈ కూరును రూపొందించారు. మామూలు కారు రోడ్డుంటేనే ముందుకు సాగుతుంది. కొండలు గుట్టలు దానికి పనికిరావు. కానీ హ్యుండాయ్ లాస్‌వెగాస్‌లో ప్రదర్శించిన ఎలివేట్ కారు సాలీడులా పొడవాటి కాళ్లమీద నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే రోబోను, కారును సంకరం చేస్తే ఇది తయారైందని చెప్పొచ్చు. మనిషి కాలు తరహాలో కాళ్లు ఉండటం దీని ప్రత్యేకత. కరెంట్ తో ఇది నడుస్తుంది.
కొండలపైన లేదా మామూలుగా అయితే వెళ్లలేని ప్రదేశాల్లోకి అన్వేషణ కొరకు, ప్రమాదాల సమయాల్లో దీనిని పంపించవచ్చు. ఇది ఎక్కడికైనా సులభంగా వెళ్లగలుగుతుంది. విపత్తులు సమయంలో ఈ కారు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని హ్యుండాయ్ ప్రతినిధి జాన్ సూ చెప్పారు. దీని కాళ్ల చివరన చక్రాలు కూడా ఉంటాయి. రోడ్డు మామూలుగా ఉంటే చక్రాలమీద యథావిధిగా ఇది పరుగెడుతుంది. పొడవైన కాళ్లుండే జంతువుల నడక విధానాలను ఇది అనుకరిస్తుంది. వికలాంగులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
మెట్ల వల్ల చక్రాలకుర్చీ ఉపయోగానికి ఏర్పడే పరిమితులకు ఇది చెక్ పెడుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు