"ప్రాణం ఖరీదు" టీజర్ రిలీజ్

- January 09, 2019 , by Maagulf

మెగా స్టార్ సుప్రీం హీరో చిరంజీవి మొదటి సినిమా పేరుతో వస్తున్న "ప్రాణం ఖరీదు" మూవీ ఈ చిత్రంతో ప్రశాంత్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం లోఅవంతిక హీరోయిన్. నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఎన్ . ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్నది. ఇప్పటికే ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడమే కాకుండా యు/ఎ సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు పి. ఎల్. కె. రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాము. ముందుగా మా చిత్ర టీజర్ ని విడుదల చేసాం. మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అని తెలియజేసారు. ప్రొడ్యూసర్ నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ మా "ప్రాణం ఖరీదు" మూవీ టీజర్ ని సోషల్ మీడియా లో విడుదల చేసాం మంచి విడుదల తేది చూసుకొని అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.

హీరో ప్రశాంత్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా పేరు నా మొదటి సినిమా పేరు "ప్రాణం ఖరీదు" అవడం నాకు చాలా ఆనందం గా ఉంది.మా కథకి తగ్గ టైటిల్ కావడంతో మేము ఈ టైటిల్ పెట్టడం జరిగింది, "ప్రాణం ఖరీదు" సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠతో ఈ కథ నడుస్తుంది మా టీజర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసాం. సినీ ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ చూసి మా చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

నటీనటులు: ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న ,షఫి, జెమినీ సురేష్ ,చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన.
టెక్నిషియన్స్ కెమెరా మెన్ : మురళి మోహన్ రెడ్డి , సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ మాటలు: మారుదూరి రాజా
పి ఆర్. ఓ: కడలి రాంబాబు
నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి
దర్శకత్వం: పి. ఎల్.కె. రెడ్డి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com