ఆర్‌యుడబ్ల్యు - సెకెండ్‌ సెమిస్టర్‌ అడ్మిషన్స్‌

ఆర్‌యుడబ్ల్యు - సెకెండ్‌ సెమిస్టర్‌ అడ్మిషన్స్‌

రాయల్‌ యూనివర్సిటీ ఫర్‌ విమెన్‌ (ఆర్‌యుడబ్ల్యు), హై స్కూల్‌ గ్రాడ్యుయేట్స్‌ కోసం సెకెండ్‌ సెమిస్టర్‌ అడ్మినిషన్‌ని ప్రకటించింది. 2018-19 సంవత్సరానికిగాను అడ్మిషన్‌ కోరదలచుకున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ నుంచి అప్లికేషన్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకుని, పూర్తి చేయాల్సి వుంటుంది. రాయల్‌ యూనివర్సిటీ ఫర్‌ విమెన్‌ రిజిస్ట్రాటర్‌ సమి మొహమ్మద్‌ మాట్లాడుతూ, వేగవంతమైన మరియు సులభతరమైన అడ్మిషన్‌ మెథడ్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అప్లికేషన్‌ని ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేసి, సబ్‌మిట్‌ చేయాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ని అభివృద్ధి చేయడంలో భాగంగా యూనివర్సిటీ ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సమి మొహమ్మద్‌ చెప్పారు. సౌదీ అరేబియాకి చెందిన మయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఇసి), తమ యూనివర్సిటీకి అరుదైన గౌరవం ఇచ్చినట్లు సమి మొహమ్మద్‌ పేర్కొన్నారు. స్టేట్‌ ఆఫ్‌ కువైట్‌, అలాగే సుల్తానేట్‌ ఆఫ్‌ ఒమన్‌ కూడా ఈ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. 

 

Back to Top