ప్రవాస_భారతీయమ

- January 09, 2019 , by Maagulf
ప్రవాస_భారతీయమ

#నా_మాట!!!!

#ప్రవాస_భారతీయమ!!!

బలహీన జీవితమా!!!

బద్రత లేని బ్రతుకులు!!

ఎప్పడు ఏమో అంటూ ఉక్కిరి బిక్కిరి బ్రతుకులు!!!

రక్షణ లేని బ్రతుకులని గాలికి వదిలిన ప్రభుత్వాలు!!!

నా కష్టమే కదా నాకు ఈ దూర బ్రతుకు!!!

కడుపు కాలిచ్చి,నిద్ర వదిలి,పొట్ట పస్తు పెట్టి రూపాయి రూపాయి జత చేసిన సొమ్ము.కళలు లేని నా బ్రతుకులో నిలువునా ఉప్పెన లాగ మూడవ మనిషి ఆకాశంలోకి చూపి మాయ మాటలని నమ్మించి నా రూపాయలకు జతగా అప్పులు చేసి నిజమేనని నమ్మి ప్రయాణం మొదలు పెడితిని!!!

ఎన్నో ఎన్నో ఆపసోపాలు మధ్యన భారత ప్రభుత్వ పౌరసత్వం పొంద్ది  ఈ ప్రయాణానికి మొదట అంకం పూర్తి చేసుకుని, వీసాకి పాట్లు పడి విసాను ఎట్టకేలకు పొంద్దిన నేను ఇరుకు కురుకుగా ఉన్న నా బ్రతుకు మధ్యన రూపాయిలు అప్పులు పొంది చేతులు మధ్యన భయంతో మారిన లక్షలు ప్రయాణనికి ఆసన్నమైంది !!!

కుటుంబానికి దూరం అవుతూ అందరిలో  ఒంటరి అవుతూ బయటికి చూపకుండా మనసు లోపల చింతనతో బిగుస్తున్న నా కనులు కన్నీళ్లను చుట్టూ ఉన్న నా బాధ్యతల కోసం!!!

ఈ రెక్కలు ప్రయాణానికి మొదలై రెక్కలు వాహనం ఎక్కి ఆకాశం ఎత్తులో ఎగురుతున్న మనసు నిండా కన్నీళ్లు చుట్టూ కుటుంబ కలవరాలు రూపాలు ఇంకా ఎటు నా కనులు మూతలు పడెను మనసుని తడుతూన్న పిల్లలు కుటుంబ జ్ఞాపకాలకి కనులు చెమ్మా అయి కారి వెచ్చగా జారీ నా అరచేతిలో నీటి బిందువులో కుటుంబం!!!

ఇన్ని బాధల మధ్యన రెక్కలు వాహనం దిగి గేటు దగ్గర చేరి ఇమ్మిగ్రేషన్లో ఎన్నో ఎన్నో ప్రశ్నలు తెలియని బాష దిక్కు తోచని స్థితిలో ఏమి తెలియని నేను ఇంత దూరం వచ్చి అడిగిన వాటికి సమాధానం లేక బిక్కు బిక్కు మంటూ నా చూపులు!!!

ఇమ్మిగ్రేషన్ నుచ్చి తిరుగు ప్రయాణాలు ఎన్నో గేటు దాటి అటు దేశంలో అడుగు పెట్టె ప్రయాణాలు కొన్ని!!!

గేట్ బయట అడుగు పెట్టి భాష రాని దేశాన ఎవరో కూడా తెలీదు,మాట చెప్పి తీసుకున్న మనిషి రాకనే లేదు పొద్దు అంత ఎదురు చూసి చూసి పొద్దు మాటున నను కొన్న సేటు దారుడు వచ్చి తీసుకెళ్లగా దిగి దిగగానే పాస్పోర్ట్ లాగేసుకోని హింసలు మొదలు వాడి వికృష్ట చేష్టలతో నాకు మొదటి దెబ్బలు!!!

ఎన్ని ఎన్ని కలలు కన్నాను ఈ బ్రతుకు కోసమా నా ఇంత ప్రయాణం మధ్య వ్యక్తి మాటలు నమ్మి మోసపోతినే ఏమి చేయలేని ఒంటరిని బందీ అయిన నేను కన్నీళ్లు,కుటుంబ, పిల్లలు, అందరి మధ్యన పచ్చడి మెతుకుల అనందం బ్రహ్మాండం మాయ మాటలు నమ్మి వెలుగు లేని బ్రతుకుని చేసుకుటిని చేతులరా!!!

మరుసటిరోజున నా కనులకి గంతలు కట్టి దూర దూరాన తీసుకెళ్లి ఎడారి మాటున నా గంతలు తీసి గోరెలు మందలు చూపి ఇదిగో ఇదే నీ పని వాటిని మేపి,వాటితో ఇక్కడే నీ జీవనం,నెలకు సరి పడ్డ సరుకులు గుడిసె నందు 
ఇదే నీ బ్రతుకు అంటూ వదిలి వెళ్లిన వాడే వాడి రాక మాసాలు అయిన లేదు కుటుంబతో మాట్లాడి మాసాలు అయ్యే ఫోన్ లేదు తిండి లేదు,తాగడానికి నీళ్లు లేవు ఎడారి నందు ఇసుక తవిన చుక్క నీరు లేదు ,దారి మాటు వెళ్లిన వారిని అడగడానికి ఇటు ఎవరు రారు!!!!

మాసాలు అయిన జీవితం లేదు ఇంటికి ఫోన్ లేదు మనసులో బాధలు ఇక్కడ ఇంటి నందు భయాలు అక్కడ ఏమి నా ఈ జీవితం  అంటూ తల్చుకుంటు గుడిస నందు ఊగుతున్న తాడు గొంతు నందు బిగించుకుందామ అనుకునే అంత బాధ తాడు వైపు అడుగులు వేసిన కుటుంబ పిలుపు, పిల్లల అరుపులు,నను నమ్మి తాడు కటించుకున్న అర్దాంగి ఇన్ని రూప ఛాయల మధ్య ఉరి సరైనద అంటూ ప్రశ్న వేసిన మనసు!!!

ఓ నాయక నేను ఏనుకున్న నాయక విదేశీ మారకన్నీ స్వదేశానికి రప్పించడంలో పాత్ర చాలా ఉంది అంటూ సొగసు పలికే మీ మాటలు మరి మాకు అండదండలు ఎక్కడ లోపలకి వెళ్లక ఇంటికి తిరుగు ప్రయాణం పట్టిన నాకు మధ్య వ్యక్తి మోసం వివరణ ఇచ్చిన పట్టించుకోని నాయక ఇప్పటికైన మేలుకో!!!

DJR...🖋️🖋️🖋️

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com