వాట్సాప్: భారీగా అకౌంట్ల కోత
- January 09, 2019
ఢిల్లీ:చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టడానికి వాట్సాప్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దానికి సంబంధించి వెలువడిన నివేదిక ప్రకారం.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోన్న 1,30,000 ఖాతాలను 10 రోజుల్లో బ్లాక్ చేసిందని సమాచారం. ఏఐ టూల్స్ సాయంతో ఈ ఖాతాల్లోని సమాచారాన్ని గుర్తించి కొన్ని ఖాతాలను తొలగించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఈ ఖాతాల వివరాలను యూఎస్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిట్ చిల్డ్రన్‌కు అందించింది. చైల్డ్ర్ పోర్నోగ్రఫీకి సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టేప్పుడు ఈ సమాచారం ఉపయోగపడనుంది.
మామూలుగా వాట్సాప్ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసినవి. యూజర్లు ఏం షేర్ చేస్తున్నారో కంపెనీ చూడలేదు. అయితే కొన్ని యాప్స్ కృత్రిమ మేథ ఆధారంగా నడిచే టూల్స్‌ను ఉపయోగించి ప్రొఫైల్ ఫొటోలు, గ్రూప్ ప్రొఫైల్ ఫొటోలు వంటి ఎన్‌క్రిప్ట్ చేయని సమాచారం గురించి తెలుసుకోగలుగుతున్నాయి. అలాగే వాట్సాప్ కూడా పొటో డీఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి పోర్న్, అసంబద్ధ చిత్రాలను గుర్తిస్తుంది. దాని ద్వారా ఏఏ ఖాతాదారులు ఇలాంటి సమాచారాన్ని షేర్ చేస్తున్నారో తెలుసుకొని, అరికడుతోంది. ఈ నివేదికలపై వాట్సాప్ ప్రతినిధి స్పందించారు. 'పిల్లలపై లైంగిక వేధింపులను ఏమాత్రం సహించం. దాన్ని అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను తీసుకువచ్చాం. అనుమానాస్పదంగా ఉండే సమాచారాన్ని వెంటనే నిషేధిస్తాం. ఈ విషయంలో భారత్, ఇతర దేశాలకు దర్యాప్తు విషయంలో సహకరిస్తాం. ఈ అనుచిత కార్యకలాపాలను అరికట్టడానికి అన్ని సాంకేతిక కంపెనీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది' అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!