బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు...
- January 10, 2019
భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పదవతరగతి ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత క్రీడా విభాగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థుల వయసు: 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
దేహదారుఢ్య పరీక్షలు, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పోస్టులు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
ఖాళీల సంఖ్య: 63
క్రీడాంశాలు: ఆర్చరీ, ఆక్వాటిక్, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, తైక్వాండో, ఉషూ, వాలీబాల్,వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిప్టింగ్, రెజ్లింగ్.
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.120. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సంబంధిత క్రీడల ట్రయల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా
జీతం: 21,700
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పత్రికలో ఉద్యోగ ప్రకటన వెలువడిన నాటి నుంచి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 05-11 ఎడిషన్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడింది.
చిరునామా: The Commandant, 95 Bn BSF, Bhondsi, Post Office-Bhondsi, District-Gurugram, Haryana-122102.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!