రజనీ ‘పేట’..ట్విట్టర్ రివ్యూ

రజనీ ‘పేట’..ట్విట్టర్ రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఆ మధ్య వచ్చిన కబాలి, కాలా, 2.0లు తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. కానీ ఇప్పుడు వచ్చిన పేట సినిమాని తెలుగు వారు ఆదరిస్తున్నారు. 90ల నాటి రజనీకాంత్‌ను మరోసారి గుర్తు చేసిన సినిమా అభిమానులు చెప్పుకుంటున్నారు.

 
ఇది పక్కా మాస్ మసాలా సినిమా అని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరెకెక్కించిన తమిళ చిత్రం పెట్టాని తెలుగులో పేట పేరుతో రిలీజ్ చేశారు. సిమ్రాన్, విజయ్ సేతుపతి, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

Back to Top