ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ డేస్ సేల్..

ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ డేస్ సేల్..

ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అసుస్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. బుధవారం ప్రారంభమైన ఈ సేల్ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో పలు అసుస్ ఫోన్లపై భారీ రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ అసుస్ జెన్‌ఫోన్ 5 జడ్ వేరియంట్ రూ.8 వేల తగ్గింపుతో రూ.28,999 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8 వేల తగ్గింపుతో రూ.24,999 ధరకు లభిస్తుంది.

జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వెయ్యి తగ్గింపుతో రూ.12,999 ధరకు.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 10,999 ధరకు.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8,999 ధరకు అందుబాటులో ఉంది. ఇక అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 రూ.4,999 ధరకు లభిస్తుంది.

Back to Top